ad1
ad1
Card image cap
Tags  

  27-01-2024       RJ

జగన్ ను సాగనంపుదాం రండి.. పీలేరు సభలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్

తిరుపతి, జనవరి 27: జగన్ అవినీతి అక్రమాలకతో ఎపి పూర్తిగా నష్టపోయిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకోర్టులో వైకాపాను శిక్షించే సమయం దగ్గరపడిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. ఆయనకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పీలేరులో తెదేపా నిర్వహించిన 'రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రజలు కసినంతా ఎన్నికల సమయంలో జగన్పై చూపించాలి. వచ్చేది యుద్ధం.. దానికి మేం సిద్ధంగా ఉన్నాం. కురుక్షేత్రంలో గెలుపు తెదేపా, జనసేనదే. ఎన్నికల అనంతరం వైకాపా జెండా పీకేయడం ఖాయం అన్నారు. పీలేరు గర్జన రాష్ట్రం మొత్తం వినిపించాలి. జగన్ రాయలసీమ ద్రోహి. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత తెదేపాదేనని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుంది. అబద్దాల్లో జగన్ పీహెచీ చేశారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ. ఇలాంటి జలగ మనకు అవసరమా? బటన్ నొక్కుడులో ఎంత దోచుకున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పీలేరులో రా..కదలి రా బహిరంగ సభలోనూ జగన్ పై చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు.

విశాఖలో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభను ఇక్కడ ప్రస్తావిస్తూ.. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ప్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగనన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. జగన్ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు.

'యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి మేము సిద్ధం' అని తేల్చిచెప్పారు. కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు. ఒక్క అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదని మండిపడ్డారు. 'నేను రాయలసీమ బిడ్డను, నాలో ఉన్నది రాయలసీమ రక్తం. రాయలసీమను రతనాల సీమ చేయాలంటే ఏం చేయాలో అన్ని ఆలోచన చేశాను. హంద్రీనివాపై మేము రూ.4200 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ ఒక రూపాయి కూడా పెట్టలేదు.

పీలేరు పుంగనూరులకు నీళ్లు రాలేదు. గాలేరు నగిరిపై రూ.1550 కోట్లు మేము ఖర్చు పెట్టాం అని చంద్రబాబు వెల్లడించారు. ఇదిలావుంటే పీలేరులో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో భద్రతా వైఫల్యం తలెత్తింది. డీ జోన్లోకి జనం వచ్చారు. దీంతో ఎన్ఎ కమెండోలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు చుట్టూ చేరిపోయారు. చుట్టుపక్కల జనం నిండిపోవడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది పూర్తిగా అప్రమత్తమైంది.

పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. పీలేరు సభా ప్రాంగణం జనసంద్రం అయింది. రోడ్లన్నీ జనంతో ట్రాఫిక్ జామ్ అయింది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెప్పినా జనం వెనక్కు వెళ్ళలేదు. తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండండి అంటూ చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారు. సభకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సభా వేదిక వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు దూసుకువచ్చారు.

రక్షణగా కట్టిన బారికేడ్లను దాటుకుని వేదిక వద్దకు వచ్చారు. సభా వేదిక ముందుండి సర్కిల్లోకి వేల మంది కార్యకర్తలు దూసుకొచ్చారు. సీఎం సీఎం అంటూ సభా ప్రాంగణం స్లోగన్స్ తో హోరెత్తింది. కార్యకర్తలను అదుపుచేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో భద్రతా సిబ్బంది కంగారుపడింది. కార్యకర్తలను అదుపు చేయలేక ఇబ్బంది పడ్డారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP