27-01-2024 RJ
తెలంగాణ
కొండగట్టు, జనవరి 27: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. అంజన్న దర్శనానికి గంటకుపైగా సమయం పడుతున్నది. వందలాది వాహనాలతో ఘాటు రోడ్డు, ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. మేడారం జాతరకు ముందు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.