27-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లు, జనవరి 27: పరిపాలనతో పాటు సాహితీవేత్తలకు శ్రీకృష్ణ దేవరాయలు యుగం స్వర్గధామంగా ఉండేదని వైసిపి ఇన్ చార్జి గుడాల గోపి చెప్పారు. శ్రీ కృష్ణ దేవరాయలు 553 వ జయంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆయన విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన తెలుగు భాషకు చేసిన కృషిని అభినందించారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారని అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుతం పాలకులు తెలుగు కు ప్రాధాన్యత తగ్గించారని యునైటెడ్ కాపు క్లబ్ గవర్నర్ డా ముచ్చర్ల సంజయ్ చెప్పారు. ఇంకా టిటిడి సభ్యులు మేకా శేషుబాబు, పట్టణ ప్రముఖులు యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబు, యర్రంశెట్టి వెంకట రత్నం, అడబాల వెంకటరమణ, ముచ్చర్ల శ్రీరాం, జక్కంపూడి కుమార్, గాదె ఆంజనేయులు, పెనుమాక రామ్మోహన్ తదితరులు ప్రసంగించారు.