27-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 27: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్ షా రావాల్సి ఉండగా బీహార్ పరిణామాల నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఆదివారం బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో పర్యటించి ఒకే రోజు మూడు సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. అయితే కొన్ని అత్యవసర పనుల వల్ల అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది.
దీంతో అమిత్ షా పాల్గొనాల్సిన కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలు వాయిదా పడిన్లటైంది. బీహార్లో తాజా రాజకీయ పరిణామాలతో అమిత్ షా టూర్ రద్దు అయినట్లు సమాచారం. త్వరలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ బిహార్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అత్యవసర పనుల వల్ల రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలు వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. బిహార్ రాజకీయ పరిస్థితుల కారణంగా అమిత్ షా రేపటి తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లోని కొంగరకలాన్ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం ఉంటుందని ఎ:- లాన్ చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. 8 స్థానాల్లో గెలవడమే కాకుండా మరో 18 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ బాగా బలపడుతోందని హైకమాండ్ అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో పార్టీ నేతకు దిశానిర్దేశర చేయాలని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నేతలు వర్గ పోరాటానికి దిగడంతో పార్టీ ఎక్కువగా నష్టపోయింది.
సీనియర్లు అందరూ ఓడిపోవడానికి వర్గ పోరాటమే కారణమని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో ఓ వార్ రూం సిద్ధం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే వార్ రూం పని చేసే ? అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే సూచనలు, సలహాలు ఆధారంగా పని చేసే అవకాశాలు ఉన్నాయి. కనీసం పది నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా ప్రయత్నించాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు..