27-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 27: గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అమోదించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమిర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమించారు. వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్, సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ మొదట వీటి భర్తీ కోసం దాసోజు శ్రవణ్, కె. సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. ఈ +లును గవర్నరు పంపించగా ఆమె తిరస్కరించిన విషయం తెలిసిందే.