27-01-2024 RJ
సినీ స్క్రీన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి సోదరులు సురేష్ బాబు, వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న వెంకటేష్, సురేష్ బాబులు రేవంత్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. కాగా ప్రస్తుతం ఇందుకు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.