27-01-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, జనవరి 27: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమని, బీఆర్ఎస్ కు మాత్రం కథానాయకులని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బోథ్ మండలంలోని పరిచయ శనివారం జరిగింది. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలిపించాలని కోరారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్లమెంట్ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి బీఅర్ఎస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ దండే విఠల్, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, మాజీ శాసనసభ్యులు అత్రం సక్కు, మాజీ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.