ad1
ad1
Card image cap
Tags  

  27-01-2024       RJ

త్వరలో.. సీఎం ఆదేశాలతో తెలంగాణలో కులగణన

తెలంగాణ

హైదరాబాద్, జనవరి 27: త్వరలోనే తెలంగాణలో కుల గణన చేపడుతామని.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ మేరకు అధికారుల్ని ఆదేశించారు.

అలాగే.. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని, వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని చెప్పారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి.. బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు మొదలైనవన్నీ పెండింగ్ లేకుండా చూడాలని.. గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మహాత్మ జ్యోతిరావు ఫూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీము మరింత సమర్థంగా అమలు చేయాలన్నారు. ఇప్పుడున్న విద్యార్థుల కంటే ఎక్కువ మంది అర్హులైన వారికి మేలు జరిగేలా చూడాలన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని చెప్పారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా.. ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని.. దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువు కోవటం ద్వారా.. వారిలో ప్రతిభా పాఠవాలతో పాటు పోటీతత్వం పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను గుర్తించాలని.. ఒకవేళ నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకపోతే, ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్ లో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి, హబ్ గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలని అన్నారు. ఈ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీపీఆర్) ఫండ్స్ ను సమీకరించాలని.. ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి, ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేశారు. ఇదే సమయంలో.. కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బ్జడెట్ ను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP