27-01-2024 RJ
సినీ స్క్రీన్
కోలీవుడ్ స్టార్ జంట సూర్య, జ్యోతికలు విడాకులు తీసుకోనున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా జ్యోతిక కుటుంబానికి దూరంగా ఉంటూ ముంబైలో ఉంటున్నారు. కుటుంబంలో గొడవలు ఉన్నా పిల్లల చదువుల కోసమే ముంబైకి షిఫ్ట్ అయినట్లు జ్యోతిక క్లారిటీ ఇచ్చారు. అయితే వీరిమధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని సూర్య, జ్యోతికలు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు ఒక్కదాని వెంట మరొకటి వస్తూనే ఉన్నాయి. కుటుంబ కలహాలతోనే వీరు ముంబైలో ఉంటున్నారన్న వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వార్తలపై జ్యోతిక మొదటిసారిగా స్పందించారు. నాకు సూర్యకు మధ్య ఎలాంటి గొడవులు లేవు. పిల్లల చదువుతో పాటు తను బాలీవుడ్ సినిమాలకు కమిట్ అవ్వడం.. నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోవడం వంటి కారణాలతో తాను ముంబైకు షిఫ్ట్ అయినట్లు చెప్పుకొచ్చారు జ్యోతిక. సూర్య చాలా మంచి వ్యక్తి అని.. మా ఇద్దరికీ విడాకులు తీసుకునే ఆలోచన లేదని చెప్పింది. పిల్లల చదువులు పూర్తవ్వగానే తాము చెన్నై తిరిగి వస్తామని జ్యోతిక వెల్లడించింది.