29-01-2024 RJ
తెలంగాణ
రాజన్న సిరిసిల్ల, జనవరి 29: సిరిసిల్లలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు షాక్ తగిలింది. ముస్తాబాద్ మండలం జడ్పీటీసీ సభ్యుడు నర్సయ్య రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పలువురు సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు రాజీనామాలు చేశారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇటీవలే కేటీఆర్ సిరిసిల్లలో మీటింగ్ పెట్టారు.
ఇంతలోనే నేతలు రాజీనామా విషయం బయటకు వచ్చింది. అయితే వారంతా రాజీనామా చేసే యోచనతోనే కేటీఆర్ సమావేశానికి సైతం గైర్హాజరైనట్టు సమాచారం. నేడో రేపో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.