29-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 29: వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీలో దౌర్జన్యాలు, అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ వర్గాలను అణగదొక్కి. జగన్ నా బీసీలని కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. చెవిటిపల్లి దుర్గారావు అనే మత్స్యకారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారన్నారు. జై జగన్ అని చెప్పమంటే.. జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను చంపారని స్టార్ అయ్యారు. వైసీపీలో చేరనందుకు పద్మను వివస్త్రను చేసి వేధించారని చెప్పారు.
రాంసింగ్ అనే బీసీ.. హారన్ కొట్టాడని చితకబాదారన్నారు. తన అక్కను వేధించవద్దన్నందుకు అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగులబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో కృష్ణా మాస్టర్ ని దారుణంగా చంపారన్నారు. అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నియంతృత్వ జగన్ ప్రభుత్వాన్ని గ్ధదె దించే తొలి ఓటు బీసీలదే అవుతుందని కొల్లు రవీంద్ర అన్నారు.