ad1
ad1
Card image cap
Tags  

  29-01-2024       RJ

వచ్చే ఎన్నికల్లో టిడిపి - జనసేన విజయం ఖాయం: టీడీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి, జనవరి 29: రాష్ట్రంలో ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీలో తిరుగుబాటు మొదలైందని.. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలంతా భయపడతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. వైసీపీని గ్ధదె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని.. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన 'రా.. కదలిరా’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

వైసీపీ నేతలు నడిరోడ్డుపైనే మహిళలను వేధిస్తున్నారని.. వారి జోలికి వస్తే వైసీపీకి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల కోసం వైసీపీ నేతల మాటలు భరిస్తున్నా మని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని.. ఆ ఉన్మాది పాలనలో అందరం బాధితులమేనని చెప్పారు. సీఎం జగన్ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. 'ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారు. ఆకు కూరలు దొరకడం లేదు కానీ రాష్ట్రమంతా గంజాయి దొరుకుతుంది. దానికి బానిసల్ని చేసి యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ చెప్పేవన్నీ నీతులని.. చేసేవన్నీ సైకో పనులని చంద్రబాబు దుయ్యబట్టారు. దళితులెవరైనా ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేళ్లలో 6 వేల దాడులు చేశారని.. 188 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. 'మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చోణ్ని చేసి చంపారు. కోడికత్తి శ్రీని ఐదేళ్ల నుంచి జైలులో ఉన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా.?’ అని ప్రశ్నించారు. పన్నుల బాదుడుతో జగన్ పేదల రక్తం తాగుతున్నారని.. ప్రభుత్వంలో 9 సార్లు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు.

ఎన్నికల్లో వైసీపీని భూ స్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అటు, రాజమండ్రి కాతేరు 'రా.. కదలిరా’ సభలో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. ఆయన వేదికపై నుంచి కింద పడబోగా వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పట్టుకున్నారు. రాజానగరం టికెట్ ను జనసేనకు కేటాయించడంపై బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. స్టేజ్ పై నుంచి చంద్రబాబు దిగుతుండగా.. కార్యకర్తలు దూకుడుగా దిగడంతో ఆయన తూలి కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పట్టుకున్నారు. కార్యకర్తల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంయమనం పాటించాలని సూచించారు. రాజానగరం అసెంబ్లీ స్థానంలో టీడీపీయే పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అయితే, ఈ విషయమై కార్యకర్తలకు చంద్రబాబు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. వీరికి పార్టీ సీనియర్లు కూడా సర్దిచెప్పేందుకు యత్నించారు. వెంకటరమణ వర్గీయులు స్టేజీపై ఒక్కసారిగా తోసుకువచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూకుడుగా దిగడంతో చంద్రబాబు పట్టు తప్పి కింద పడబోయారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP