29-01-2024 RJ
సినీ స్క్రీన్
అగ్ర నటీమణుల్లో ఒకరైన సమంత ఎయిర్ పోర్టు నుండి వస్తున్నప్పుడో, వెళుతున్నప్పుడో ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. సమంత మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతూ అందుకోసమని ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఆమె చివరి సినిమా 'ఖుషి' విడుదలైంది, ఆ తరువాత ఆమె సినిమాలు ఏమీ కొత్తవి ఒప్పుకోలేదు, కానీ నిర్మాతగా కొన్ని సినిమాలు చేస్తాను అని చెప్పారు. ఈమె చెయ్యాల్సిన సినిమా ఒకటి ఇప్పుడు శృతి హాసన్ చేస్తున్నారు. అంటే సమంత ఇప్పట్లో సినిమాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు అని తెలుస్తోంది.
అయితే ఇంతకీ సమంత మళ్ళీ వెండితెర మీద కనిపించదా, అనే సందేహం కూడా ఆమె అభిమానుల్లో చోటుచేసుకుంటోంది. ఎందుకంటే ఆమె చివరి సినిమా 'ఖుషి' గత సంవత్సరం సెప్టెంబర్ 1న విడుదలైంది. ఆ సినిమా విడుదలవ్వకముందే సమంత అమెరికా వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ ఇండియా వచ్చింది, ఇక్కడ సినిమాలు చెయ్యడం లేదు కానీ, చాల చురుకుగా సామజిక మాధ్యమాల్లోనూ, అలాగే కొన్ని షోస్ లో కనపడుతూ అభిమానులను అలరిస్తున్నారు.