ad1
ad1
Card image cap
Tags  

  30-01-2024       RJ

కొత్తగా పివి పేరుతో జిల్లా ఏర్పాటు పై అసెంబ్లీలో చర్చ

తెలంగాణ

హైదరాబాద్, జనవరి 30: కొత్త జిల్లాల ఏర్పాటు అసంబద్దంగా జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి అంగీకరించాక.. దీనిపై కమిషన్ వేసి అధ్యయనం చేస్తామని ప్రకటించారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో ఉన్న లోటుపాట్లను తొలగిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాల కుదింపు జరగవచ్చన్న సంకేతాలు వచ్చాయి. పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశారు. ఇందులో అధ్యయనం తరవాత శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం కావచ్చు. గత బిఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాలను ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేశారు.

కొత్తగా కమిషన్ ఏర్పాటు చేసి, అసెంబ్లీలో చర్చించాక కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని సిఎం రేవంత్ ప్రకటించారు. దీంతో శాస్త్రీయంగా ఏర్పాటుకు అవకాశం రానుంది. ఈ క్రమంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరుతో జిల్లాని ఏర్పాటు చేయాలని డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. అప్పటి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో హుజురాబాద్ కేంద్రం గా పీవీ నరసింహారావు జిల్లాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయినా ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి పీవీ జిల్లా తెరపైకి వచ్చింది.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్రంగా పీవీ నరసింహారావు జిల్లాని ఏర్పాటు చేయాలని మేధావులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మాజీ ప్రధాని పీవీ భీమదేవరపల్లి మండలం వంగరలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఇక్కడి నుండే మొదలు అయ్యింది. అయన జ్ఞాపకాల గుర్తుగా హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలారోజుల నుండి ఉంది. గత బీఅర్ఎస్ ప్రభుత్వం పది జిల్లాల నుండి ముప్ఫై మూడు జిల్లాలకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అ సమయంలోనే వీవీ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరిగింది. ఈక్రమంలోనే వీవీ జిల్లా సాధన సమితిని కూడా జేఏసి నేతలు ఏర్పాటు చేశారు. అప్పట్లో హుజురాబాద్ కేంద్రంగా నెల రోజులపాటు అందోళన కార్యక్రమాలు జరిగాయి.

అప్పటి రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ జోక్యం చేసుకుని అందోళన విరమింపజేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. అయితే హుజురాబాద్ జిల్లా కేంద్రం కాకుండా డివిజన్ కేంద్రంగా మారింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో జిల్లాల పునర్విభజనపై చర్చ జరుగుతోంది ఈ క్రమంలో మరోసారి వీవీ జిల్లా తెరపైకి వచ్చింది. నిజానికి ప్రొఫెసర్ జయశంకర్, కుమ్రం భీమ్, యాదాద్రి, వేములవాడ రాజన్న, జోగులాంబల పేరు మీద జిల్లాలు ఏర్పాడ్డాయి.

పివి పేరు మాత్రం విస్మరించారు. దీంతో హుజురాబాద్ కేంద్రంగా పదిహేను మండలాలని కలుపుతూ పీవీ జిల్లాని ఏర్పాటు చేయాలని మేధావులతో పాటుగా ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారిగా హుజురాబాద్ లో పివి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం హాజరు అయ్యారు. అయన సైతం పివి జిల్లాని ఏర్పాటు చేయాలని సూచించారు. పివి జిల్లాపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పివి చేపట్టిన ఆర్థిక సంస్కరణలు.. భూ సంస్కరణలు చేపట్టారని ప్రస్తావించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జిల్లాలని మార్చడం, లేదంటే కుదించడంపై చర్చ సాగుతుంది. పరిపాలన సౌలభ్యంగా ఉండే జిల్లాలని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. పివి జిల్లా ఏర్పాటుకు ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడంతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పివి సేవలు గుర్తుండే విధంగా అయన పేరుతో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జేఏసి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అరేళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వీవీ జిల్లాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పివి జిల్లా కోసం ఎనిమిది ఏళ్ళుగా పోరాటం సాగుతుందని ఎమ్మెల్సీ కోదండరాం అంటున్నారు. అయన పేరు పైనా జిల్లా ఏర్పాటుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాల పరిశీలనపై కమిటీ వేసి చర్చించే అవకాశం ఉంది. విధివిధానాలు ఖరారు చేస్తారు. ఆ మేరకు జిల్లాల ఏర్పాటుతో పాటు, రూపురేఖలు మారనున్నాయి. అప్పుడు పివి జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP