30-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జనవరి 30: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావో బండి సంజయ్ చర్చకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ విద్యార్థి, యూత్ నాయకులు డిమాండ్ చేశారు. బండి సంజయ్ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని కూడా అన్నారు. నోరు ఉంది కదా అని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పై తప్పుడు కూతలు కూస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు లేరని కూడా హెచ్చరించారు.
ఎన్నికలు రాగానే మతం ముసుగులో రాజకీయాలు చేసే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి ఎంతో చూపించేందు చర్చకు సిద్ధం కావాలని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి, యూత్ నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, భూక్య తిరుపతి నాయక్, ద్యావ మధుసూదన్ రెడ్డి, కేంసారం తిరుపతిలు అన్నారు. కరీంనగర్ లోని మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బోయినపల్లి వినోద్ కుమార్ నాస్తికుడు అని తప్పుడు కూతలు కూస్తున్నావని మండిపడ్డారు.
బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటు లో గళమెత్తిన గొప్ప వ్యక్తన్నారు. బండి సంజయ్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించు... కేంద్రం నుంచి ఏడాదికోసారి రెగ్యులర్ గా వచ్చే నిధులు కూడా తెచ్చినట్లు బిల్డప్ లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014లో బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీ అయ్యాక రైల్వే లైన్ మంజూరు చేయించారు... కనీసం కరీంనగర్ కు ఆర్జ్బే అయినా తెచ్చావా బండి అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయడం చేతకాని బండి సంజయ్... ఎన్నికలు రాగానే మతం ముసుగు వేసుకుని రాజకీయాలు చేస్తున్నారని, దమ్ము ఉంటే ప్రజాక్షేత్రంలో చేసిన అభివృద్ధి చూపించి మాట్లాడలని అన్నారు.
దేవుళ్ళ పేరు చెప్పి ఎవరు వ్యాపారం.. రాజకీయాలు చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. కరీంనగర్ నడిఒడ్డున టీటీడీ నుంచి 25 కోట్ల నిధులు తెచ్చి వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం చేయించిన ఘనత బోయినపల్లి వినోద్ కుమార్దని అన్నారు. వేములవాడ, కొండగట్టు ఆలయాల నిర్మాణాలకు బండి సంజయ్ నయాపైసా అయినా తెచ్చారా అని వారు ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్ కి ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. మా బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అనుమతులతో పాటు పవర్ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చారని అన్నారు.
ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిదీలో ఒక్క నవోదయ పాఠశాల అయినా తెచ్చావా ఏమన్న అంటే శివమ్ ఎళ్తే మాది.. శవం ఎళ్తే మీది అంటూ ప్రజల మనోభావాలతోనీ ఆడుకుంటున్నావ్ తప్ప నీవు ఎప్పుడైనా అభివృద్ధి చేశావా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గవ్వ వంశీధర్ రెడ్డి, బండ వేణు యాదవ్, శ్రావణ్ పటేల్, సత్తినేని శ్రీనివాస్, ప్రదీప్, తరుణ్, నవీన్, ఓంకార్, సాయికృష్ణ, జశ్వంత్, శ్రీనివాస్, స్వామి, ప్రదీప్, మణిదీప్, మహేందర్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.