30-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 30: తెలంగాణలో బీసీ కులగణన చేసేందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. మంగళవారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఆర్. కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. కుల గణనతో బీసీ కులాలు, ఉప కులాలన్నింటికీ ప్రభుత్వ పథకాల్లో సముచిత న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికారం చేపట్టిన రోజు నుంచే తెలంగాణలో ప్రజాపాలనను అందిస్తున్నందుకు సీఎంకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కుల గణన బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.