30-01-2024 RJ
సినీ స్క్రీన్
పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా పుష్ప- 2 సినిమా తెరకెక్కుతోంది. తొలి భాగం సాధించిన విజయంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేకర్స్, ముఖ్యంగా సుకుమార్ ఈ చిత్రాన్ని పార్ట్1ను మించేలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. అదీ కాక ఈ చిత్రానికి అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ఎంతో బాధ్యతతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా, పాహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా ఓ రెండు మూడ్రోజుల నుంచి పుష్ప - 2 విడుదల వాయిదా అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై బన్నీ డిజిటల్ టీమ్ వివరణ కూడా ఇచ్చింది. అనుకున్న సమయానికే పుష్పరాజ్ ర్యాంపేజ్ ఖాయం అంటూ ట్వీట్ సైతం చేశారు. తాజాగా సుకుమార్ టీమ్ మరోసారి ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో స్పష్టతనిచ్చింది. ఇంకా 200 రోజుల్లో పుష్పరాజ్ రూల్స్ ప్రారంభం కానున్నాయి' అని చెబుతూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. దీంతో పుష్ప- 2 విడుదలలో ఎలాంటి మార్పు లేదని మరోసారి క్లారిటీ ఇచ్చినటైంది.