30-01-2024 RJ
సినీ స్క్రీన్
నాగార్జున ధనుష్ తో కలిసి నటిస్తున్నారు. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధనుష్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది. తిరుపతిలోని కపిల తీర్థం నంది సర్కిల్లో ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు.
నాగార్జున ఇటీవలే నాసామిరంగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతికానుకగా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను సాధించింది. ఇక ఇప్పుడు నాగార్జున ధనుష్ తో కలిసి నటిస్తున్నారు. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధనుష్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది. తిరుపతిలోని కపిల తీర్థం నంది సర్కిల్లో ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఉదయం నుంచే తిరుమలకు వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. దాంతో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు భక్తులు దీని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అన్ని అనుమతులు తీసుకొనే షూటింగ్ చేస్తున్నామని మూవీ యూనిట్ చెప్తోంది.