01-02-2024 RJ
తెలంగాణ
మేడ్చల్ మల్కాజిగిరి, ఫిబ్రవరి 1: హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యంనంపేట రోడ్డుపై అతివేగంగా వెళు తున్న లారీ హర్షిత అనే విద్యార్థి(20) కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. యువతి ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గాయపడిన విద్యార్థిని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. శ్రీనిధి కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హర్షితగా పోలీసులు గుర్తించారు.