01-02-2024 RJ
తెలంగాణ
గుంటూరు, ఫిబ్రవరి 1: 'ప్రజల కోసం సిపిఎం! సిపిఎంకు అండగా ప్రజలు!!' అంటూ సిపిఎం 'ప్రజా 'నిధి' వసూళ్లను గురువారం ఉదయం ప్రారంభించింది. గుంటూరు జిల్లా సుందరయ్య నగర్ లో సిపియం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఫండ్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజా నిధికై ఇంటింటికీ వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ? నిధిని కోరారు.
ప్రజల నుండి సాదరంగా ఆహ్వానించి వారికి తోచిన సాయం చేస్తున్నారు. సామాన్య ప్రజల కోసం, పేదల కోసం అనునిత్యం ఉద్యమించే సిపిఎంకు అండగా నిలుస్తామని స్పందిస్తున్నారు. మతవిద్వేష రాజకీయాలతో సమాజంలో వాతావరణాన్ని విషపూరితంగా మార్చడానికి జరుగుతున్న కుట్రలను నిలువరించి ప్రజల మధ్య మతసామరస్యాన్ని, ఐక్యతను కాపాడుకోడానికి సిపిఎం జాగరూకుల్ని చేస్తోందని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నారు.
కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో పలుచోట్ల వైద్య క్యాంపులను నడిపిందని, వరదల్లో సహాయపడిందని తెలుపుతున్నారు. దళితుల, ఆదివాసీల ఇతర పేదల భూములను కబ్జా చేసే బడా నేతల ఆగడాలను ప్రతిఘటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని వారు వెల్లడించారు. ప్రజలపై విశ్వాసంతోనే సిపిఎం నిలబడి పోరాడుతుందని వారు స్పష్టం చేశారు.