01-02-2024 RJ
సినీ స్క్రీన్
సినిమాల్లో ఒక విధంగా.. అంటే అందంగా, చీరకట్టు ఇలా సంప్రదాయంగా కనిపించే హీరోయిన్లు .. బయట మాత్రం రఫ్ఫాడిస్తారు. వెండితెర మీద సినిమా చూస్తున్నప్పుడు అందులోని కథానాయికలు ఒకలా కనపడతారు, అదే నిజ జీవితంలో సామజిక మాధ్యమంలో వాళ్ళు పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే తెరమీద చూసింది వీళ్ళనేనా అనే సందేహం వస్తుంది. అంతలా ఒకదానితో ఒకటి అసలు పోలికలు వుండవు. 'మా ఊరి పొలిమేర’ సినిమా రెండు పార్టులుగా వచ్చింది, మొదటిది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదలైతే, రెండోది థియేటర్స్ లో విడుదలైంది.
మొదటి పార్టులో ఎంతో బోల్డ్ పాత్రలో కనపడిన కామాక్షి ఆ సినిమాలో ఒక ప్లలెటూరి ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఆ సినిమా ఆమెకి మంచి పేరు తీసుకువస్తే, రెండో పార్టులో కూడా ఆమె అదే పాత్రని కంటిన్యూ చేశారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది, కామాక్షికి మంచి పేరు తీసుకు వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ ఆమె ఇంకా మంచివి, పెద్దవి చెయ్యాలని అనుకుంటోంది. నిజ జీవితంలో డాక్టర్ గా వున్న కామాక్షి 'పొలిమేర' సినిమా చేతబడి నేపథ్యంగా వచ్చిన కథ కావటంతో, అటువంటివి తాను నమ్మను అని చెప్పారు. ఆ సినిమాకి మాటలు రాయటంలో కూడా కామాక్షి సహాయం చేశారు.
అలాగే దర్శకత్వ శాఖలో కూడా పని చేశారు. అన్నీ నేర్చుకోవాలి, తెలుసు కోవాలని అని అంటున్న ఆమె ముందు ముందు దర్శకత్వం చేస్తానేమో అని కూడా చెప్పారు. ఇప్పుడు ఆమె ఒక గ్లామరస్ ఫోటో ఒకటి ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు 'పొలిమేర' సినిమాల వేసింది ఈమేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతలా ఈ గ్లామర్ ఫోటోలో కనిపిస్తున్నారు కామాక్షి.