01-02-2024 RJ
సినీ స్క్రీన్
రష్మిక మందన్న ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వుంది. ఒక బాలీవుడ్ మీడియాకి తను ఇంటర్వ్యూ ఇచ్చింది, అందులో అన్ని విషయాలు గురించి మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ గురించి కూడా మాట్లాడింది. అంటే అతను తనకి ఎంత కావలసినవాడు, అతనితో తనకున్న అనుబంధం అన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. తన జీవితంలో విజయ్ ఎటువంటి పాత్ర పోషించాడు అనే విషయం మీద కూడా రష్మిక ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడింది. తామిద్దరూ నటులుగా కలిసి పెరిగామని చెప్పుకొంచింది.
అందువలన అతను తనకి బాగా కావాల్సిన వాడని, తన జీవితంలో అతని పాత్ర చాలా ముఖ్యమైనది అని కూడా చెప్పింది రష్మిక. 'నా జీవితంలో నేను ఏమి చేసినా అందులో అతని కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. నేను చేసే ప్రతి పనిలో అతని సలహా తీసుకుంటాను, అతని అభిప్రాయం తనకు ఎంతో అవసరమని' రష్మిక ఈ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఏదైనా సలహా అడిగితే అతను వెంటనే అవుననే, కాదనో చెప్పాడని, అది ఎందుకు మంచిది, అది ఎందుకు చెయ్యకూడదు అనే విషయాల మీద కూలంకషంగా చెప్పి అప్పుడు తన సలహా ఇస్తాడని చెప్పింది రష్మిక.
అందుకే అతను తన జీవితంలో వ్యక్తిగతంగా అందరికంటే ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని అతను అంటే ఎంతో గౌరవభావం ఉంటుందని, విజయ్ దేవరకొండ గురించి రష్మీక ప్రస్తావించింది. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలను బట్టి రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య వున్న బంధం ఎటువంటిదో అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. ఈ మధ్యనే రష్మిక నటించిన హిందీ సినిమా 'యానిమల్' చాలా పెద్ద విజయం సాధించి రష్మిక కి మంచి పేరు తీసుకు వచ్చింది. రణబీర్ కపూర్ ఇందులో కథానాయకుడు, సందీప్ వంగ దర్శకుడు. తెలుగులో కూడా కొన్ని పెద్ద ప్రాజెక్టులు రష్మిక చేతిలో వున్నాయి.