02-02-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ 'మనమే'. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా.. ఈ సినిమాను శమంతకమణి, దేవదాస్ చిత్రాల ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా పూర్తి అవ్వకముందే మరో సినిమా సైన్ చేశాడు శర్వానంద్.
లూజర్ తో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో తన తదుపరి వెంచర్లో శర్వానంద్ నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదిలావుంటే.. ఈ ప్రాజెక్టు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ నటి మహానటి ఫేమ్ మాళవిక నాయర్ ను తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మాళవిక నాయర్ ను మేకర్స్ సంప్రదించగా.. మాళవిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.