02-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2: పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేయనుంది.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. అలాగే కొండప్ప, సమ్మయ్య, విఠలాచార్య, కేతావత్, ఆనందాచారిలను పద్మశ్రీ వరించింది.. దీంతో వీరందరికి తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేయనుంది.
ఇందులో భాగంగా వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో కలిసి కార్యక్రమానికి మంత్రి జూపల్లి ఆహ్వానించారు.. అటు అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు జూపల్లి. ఈనెల 4న శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమం జరగనుంది.