02-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం సంజీవ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ గా పోలిశెట్టి సతీష్ చార్జ్ తీసుకున్నారు. ఈ రోజు రిలీవ్ అయిన రాంప్రసాద్ రావు, ఎస్ హెచ్ఓ పోలిశెట్టి సతీష్ ను సాదరంగా ఆహ్వానించి తన సీట్ లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా క్రొత్తగా డ్యూటీ లో జాయిన్ అయిన సతీష్ కు శుభాకాంక్షలు తెలియ చేశారు. ఆ తరువాత పి వి రాంప్రసాద్ కు సిబ్బంది అందరూ సెండాఫ్ ఫంక్షన్ చేసి, పూల దండలు తో సత్కరించారు. ఈ కార్యక్రమం లో అడ్మిన్ ఎస్ ఐ రవిరాజ్, ఎస్ ఐ శ్రావణ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. తమకు జరిగిన అభినందనలకు సతీష్ మరియు రాంప్రసాద్ రావు లు కృతజ్ఞతలు తెలియజెయడం జరిగింది.