12-02-2024 RJ
తెలంగాణ
సూర్యాపేట జిల్లా, ఫిబ్రవరి 12: బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. గత నెలలో 31వ వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి నేతృత్వంలో అవిశ్వాసానికి ప్రయత్నించి కౌన్సిలర్లు విఫలమయ్యారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డిని ఆదివారం బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. దిలీప్ రెడ్డి సస్పెన్షన్‌కు మద్దతుగా సోమవారం కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. వారంతా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.