12-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 12: దేశ సంస్కృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అంబాసిడర్ అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో దక్షిణ భారతీయ సంస్కృతి కేంద్రాన్ని, అలాగే భారత్ కళా మండపాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ఐదుగురిని సన్మానించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో సంగీత్ నాటక్ అకాడమీచే దక్షిణ భారతీయ సంస్కృతి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం ఆజాధ్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అనేక కార్యక్రమలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో కళాకారుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని అన్నారు.
ఈ రోజు మొత్తం మూడు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 30 కోట్ల వ్యయంతో 700 మంది కూర్చునే ఘంటశాల వెంకటేశ్వర రావు పేరుతో ఒక ఆడిటోరియానికి భూమి పూజ చేసినట్లు వివరించారు. కళాకరులను మరింతగ ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
జీ 20లో జరిగిన ప్రతి సదస్సులో కూడా భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమలు చేపట్టినట్లు చెప్పారు. మోదీ అధ్వర్యంలో అయోధ్యలో 550 సంవత్సరాల కళా నెరవేరిందన్నారు. కాకతీయుల నిర్మించిన వరంగల్‌లోని వెయ్యి స్థంభాల ఆలయాని అదే పోలికలతో పునర్ నిర్మిస్తున్నామని అన్నారు. గిరిజనులకు సంబంధించి ట్రైబల్ మ్యూజియాన్ని ఈ నెలలోనే హైదరాబాద్‌లో శంకుస్థాపన చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.