12-02-2024 RJ
తెలంగాణ
సూర్యాపేట, ఫిబ్రవరి 12: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని ఎస్పి హెచ్చరించారు. సిబ్బందితో పటిష్ఠమైన నిఘా ఉంచి గంజాయి సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నామని, ఇలా గంజాయి సరఫరా చేస్తూ సమాజ భద్రతకు ప్రజల ఆరోగ్యాలకు హానికలించే వారిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తల్లిదండ్రులు, ఉపాద్యాయులు పిల్లల అలవాట్లు, ప్రవర్తన పై దృష్టి పెట్టాలని, గంజాయి సమాచారాన్ని పోలీసు వారికి, 100 కు సమాచారం ఇవ్వాలని, గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని ఎస్పి కోరారు.
ప్రస్తుత కేసు వివరాలను తెలియజేస్తూ.. గంజాయి తాగటానికి అలవాటు పడ్డ ఆరుగురు నిందితులు రెండు సంవత్సరాల నుండి డబ్బులు అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఒరిస్సా సరిహద్దులో, గుర్తుతెలియని వ్యక్తుల నుండి గంజాయిని కేజీ 4500 రూపాయలకు కొనుగోలు చేసి, సూర్యాపేట చుట్టుపక్కల గంజాయి తాగేవారికి ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుత కేసులో పరారీలో ఉన్న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగలి తండాకు చెందిన నిందితుడు నునావత్ సాయి, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు తండా కు చెందిన మరొక నిందితుడు వినోద్ కి ఫోన్ చేసి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ ఘనపారపు శ్రీకాంత్ కు గంజాయి అమ్ముదామని.
ఈనెల 10వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి గ్రామము మండలానికి చెందిన డ్రైవర్ లు బోడ సురేష్, భూక్య అఖిల్ కుమార్, ఫోటోగ్రాఫర్ బానోతు మోహన్ తదితరులు కలిసి వారి వద్ద ఉన్న సుమారు రెండు కిలోల గంజా ప్యాకెట్లను తీసుకొని సురేష్ బైక్ పైన వినోద్ వద్దకు వెళ్లి, అతని వద్ద ఉన్న సుమారు పావు కేజీ గాంజా తీసుకొని, మొత్తం రెండు కిలోల 436 గ్రాములతో చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి వెళ్లి శ్రీకాంత్ కు అమ్ముదామని పక్కా ప్రణాళికను వేసుకున్నారని చెప్పారు.
సమాచారంతో.. చిలుకూరు పోలీస్ వారు మాటు వేసి ఐదుగురిని అదుపులోకి తీసుకొని 37 వేల రూపాయల విలువగల గంజాయిని, పల్సర్ బైకు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం
చేసుకుని అరెస్టు అరెస్టు చేశారని, నిందితులను కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకున్న స్పెషల్ టాస్క్ సీఐ రామకృష్ణారెడ్డి, చిలుకూరు ఎస్సై చల్లా శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు నరేష్ నాగేష్ అలీముద్దీన్ లు పాల్గొన్నారు.