12-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 12: అధికార, ప్రతిపక్షాల మధ్య కృష్ణా జలాల నీటి వాటాపై చర్చ జరిగింది. ఈ చర్చలో గత బీఆర్ఎస్(కేసీఆర్) ప్రభుత్వం చేసిన తప్పిదాలపై సభలో అధికార ఎమ్మెల్యేలు గులాబీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కేంద్రానికి గత ప్రభుత్వమే నీటి వాటాను అప్పగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీశారు.
ఇదిలా ఉంటే అసలు కేసీఆర్ అసెంబ్లీకు ఎందుకు రావడం లేదని, తెలంగాణ ప్రజలపై ఆయనకు ఉన్న అభిమానం ఇదేనా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన వాదోపవాదనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాకు వివరాలను వెల్లడించారు.