16-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా ఎం.రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ లను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజయ్య 2009-2014 మధ్య వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.