25-02-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రెండేళ్ల పాటు ఆ పదవి లో అయన కొనసాగనున్నారు. తెలంగాణలో జర్నలిజానికి ఉన్నత ప్రమాణాలను, ప్రజల కేంద్రీకృత విధానాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించే సంస్థ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
పాత్రికేయుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, మీడియా రంగంలో నైతిక విలువలను నిలబెట్టే లక్ష్యంతో కార్యకలాపాలను ప్రారంభించడానికి ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని జర్నలిస్టులకు ఈ అకాడమీ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది.