07-03-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్: గురువారం (మార్చి 7)న జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలోని వివిధ ప్రాంతాలతో సంబంధం ఉన్న పలు అభివృద్ధి పథకాలను వర్చువల్‌గా ప్రారంభించారు. పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకానికి సంబంధించి రూ. 1400 కోట్ల విలువైన 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.
వీటిలో భాగంగా హైదరాబాద్‌లోని 15వ శతాబ్దం నాటి ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం కూడా ఒకటి. ఎంతో విశిష్ట గుర్తింపు ఉన్న ఈ దేవాలయ ప్రాంగణంలో రూ. 4.4 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం వివిధ సౌకర్యాలను కల్పించనుంది. పునరుద్దరణ కార్యక్రమం లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, వోలాల రామ్మోహన్, అమీర్ పేట కార్పొరేటర్ శ్రీమతి సరళ, దేవస్థానం ఈఓ కుంట నాగరాజు, ధర్మ కర్తల కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి సాయి బాబా గౌడ్, కమిటీ సభ్యులు కూతురు నర్సింహా, సరాఫ్ సంతోష్, మరియు భక్తులు కూడా పాల్గొని కేంద్ర, రాష్ట్ర మంత్రులను అభినందించారు.