16-03-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్: ప్రజా శాంతి పార్టీ ఆఫీస్ లో ఈ రోజు (మార్చ్ 16) మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్ లో డాక్టర్ కే ఏ పాల్ మాట్లాడుతూ.. వాటర్ టాంక్ ను నేనే రెండువేల రూపాయలకు కొనుగోలు చేసేను. మామూలు ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందో మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా, మేఘా కృష్ణారెడ్డి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వేల కోట్ల రూపాయలు ఇచ్చి తాను చేసిన కాంట్రాక్టు పనుల్లో జరిగిన అవినీతిని ప్రశ్నించకుండా ఉండటానికి మేఘా కృష్ణారెడ్డి, ఈ విధంగా చేస్తున్నాడని కే ఏ పాల్ విమర్శించారు.
ఏపీ లో ముద్రగడ పద్మనాభం కాపులను రెడ్డిలకు, పవన్ కల్యాణ్ కమ్మవారికి తాకట్టు పెట్టారని విమర్శించారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ఆదానీకి అమ్మేసే సమయం లో నేను కోర్టు అనుమతి తీసుకొని అమ్మకాన్ని ఆపడం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలుసు.. నేను విశాఖలో ఎం పీ గా పోటీ చేస్తున్నాను. నాకు విశాఖ ప్రజలతో అనుబంధం ఉన్న కారణంగా నన్ను విశాఖ ప్రజలే గెలిపిస్తారని కే ఏ పాల్ తెలియ చేసారు.
తెలంగాణలో బాబూమోహన్ నీ వరంగల్ ఎం పీ గా, ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి గా నిలబెట్టి గెలుపిస్తానని తెలిపారు. బీజేపీ పై నేనే యుద్ధం చేస్తున్నాను, మిగతా పార్టీలు కేంద్రం లో ఉన్న మోదీకు భయపడి వారికి లోంగిపోతున్నారని ఆయన మండిపడ్డారు.