16-03-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ శనివారం ప్రకటించింది. కడప జిల్లా ఇడుపులపాయలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లోక్ సభ ఎన్నికలకు, రెవెన్యూ మంత్రి డి.ప్రసాదరావు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. విశాఖ లోక్ సభ స్థానం నుంచి బి.ఝాన్సీలక్ష్మి, నరసాపురం నుంచి జి.ఉమాబాల, నెల్లూరు నుంచి వి.విజయసాయిరెడ్డి పోటీ చేయనున్నారు. అనుకున్నట్లుగానే ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.