17-03-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్న నేపథ్యంలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కని పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 14న ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) జారీ చేసినప్పటికీ మార్చి 17 వరకు ఈ నియామకాలను బహిరంగంగా వెల్లడించలేదు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి సీనియర్ నేత జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డికి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా, పటేల్ రమేష్రెడ్డికి టూరిజం డెవలప్మెంట్ హెడ్గా పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతమ్, బీసీ ఫైనాన్స్ కు శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ సీడ్స్ డెవలప్ మెంట్ కు అన్వేష్ రెడ్డి, ఖనిజాభివృద్ధికి అనిల్ ఎరవంత్, మహిళా కమిషన్ కు నేరెళ్ల శారద, గిరిజన ఫైనాన్స్ డెవలప్ మెంట్ కు బెల్లయ్య నాయక్, పోలీస్ హౌసింగ్ కు గురునాధ్ రెడ్డి, అటవీ అభివృద్ధికి పోడెం వీరయ్య నియమితులయ్యారు.