18-03-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణకు రెండో గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ పనిచేశారు. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. 2021 ఫిబ్రవరి 18 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేశారు. అంతకు ముందు ఆమె బీజేపీ జాతీయ కార్యదర్శిగా, తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు.
లోక్ సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.