21-03-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలు చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.
ఎంసీసీ అమలుపై మార్చి 21 గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.