18-04-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. బేగంపేట్ లోని పైగా ప్యాలెస్ లో సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ విస్తృత సమావేశం గురువారం నిర్వహించారు.
సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... దానం నాగేందర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి బిజెపిలో కలుస్తారనే విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ప్రకటించారు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్యారెంటీలతో ప్రభుత్వంకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.
సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ.. సనత్ నగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా మెజార్టీ చూపిస్తామని ప్రకటించారు. మహిళా శక్తి కాంగ్రెస్ వెంటే ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సికింద్రాబాద్ పార్లమెంటు గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తామని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి బూత్ లో మెజార్టీ వచ్చే విధంగా బూత్ కమిటీలు పనిచేయాలని పిలుపునిచ్చారు అప్పుడే గెలుపు సాధ్యమవుతుందని సూచించారు. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. బూత్ కమిటీలు పార్టీకి అమ్మ వంటిదని అన్నారు. బూత్ కమిటీ లోని కార్యకర్తలే పార్టీకి నిజమైన కార్యకర్తలని తెలిపారు.
ప్రతి బూత్ లో పార్టీ ను మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత బూత్ కమిటీలపై ఉందని సూచించారు. విజయ రెడ్డి గారు మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటులో ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరో 20 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేస్తే ప్రజల జీవితాలు మారుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోహిత్, నాగేందర్ రాజ్, డాక్టర్ రవీందర్ గౌడ్, వివిధ డివిజన్ అధ్యక్షులు.. నరేష్, శ్రీనివాసరావు, అమనుల్లా ఖాన్, మల్లికార్జున్, చిరంజీవి, రాంగోపాల్ పేట ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మనోజ్, శ్రీను, ఎస్సీ సెల్ రమేష్, డాక్టర్ శివలాల్, మున్నీర్, మహేష్, అతిక్, ఇమ్రాన్, అజ్జూ, మల్లం రమేష్, రాజేశ్వరి, ఉషా, అన్ని డివిజన్ల ప్రజా పాలన ప్రెసిడెంట్లు పాల్గోన్నారు.