24-04-2024 RJ
తెలంగాణ
గడప గడపకు తిరుగుతూ విస్తృత పాదయాత్ర కార్యక్రమం నిర్వహించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి కూతురు కాంగ్రెస్ నాయకురాలు విజయా రెడ్డి ప్రజలను కోరారు. కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్ నెంబర్ 1,2,3,4,5 పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసిందని తెలిపారు. మహిళా సమస్యలను పరిష్కరి౦చే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు సంక్షేమానికి కట్టుబడి పని చేసే ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందని త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా సునీతా మహేందర్ రెడ్డి కోరారు. పిజెఆర్ కుమార్తె సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విజయా రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంగా అవతరించిందన్నారు. పీజేఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాల హాయంలో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి సత్యం శ్రీరంగం, కూకట్ పల్లి మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, బషీర్, మోయిజ్, సంజీవరావు, మేకల సునీల్ యాదవ్, గొట్టిముక్కల దేశాల్ రావు, గొట్టిముక్కుల వెంకటేశ్వరరావు, ప్రవీణ్, అరవింద్ రెడ్డి, కృష్ణా రాజ్ పుత్, మారుతి, అప్పారావు, సంధ్యారాణి, మనీ, వాణి భీమ్ రావు, తదితరులు పాల్గొన్నారు.