25-04-2024 RJ
తెలంగాణ
పార్లమెంట్ ఎన్నికల్లో పేదల నేస్తం సునీతమ్మను, హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని పట్నం మనీషారెడ్డి ఓటర్లను కోరారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాప్రా డివిజన్ పరిధిలోని గాంధీనగర్, బంజారా కాలనీ, సైనిక్ పూరి కాలనీ, సాయిబాబా గుడి వద్ద కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, కాంగ్రెస్ పార్టీ కాప్ర డివిజన్ ఇన్చార్జ్ సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి ప్రచారం నిర్వహించారు.
ఏ.ఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని అరుణ్ కాలనీ, హై టెన్షన్ లైన్లో డాక్టర్ కిషోర్, మానసారెడ్డిలు ఏర్పాటుచేసిన ఎం వి ఎల్ క్లినిక్ ని మనీషారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని, మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.