ad1
ad1
Card image cap
Tags  

  25-04-2024       RJ

బి.ఆర్.ఎస్ పార్టీ కి ఓటు వేసి పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ గారికి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గ BRS పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముందుగా పార్టీ పతాకాన్ని అభ్యర్థి పద్మారావు గౌడ్ ఆవిష్కరించారు.

ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..సామాన్య కార్యకర్త నుండీ నేను ఈ స్థాయి వచ్చిన.తలసాని శ్రీనివాస్ యాదవ్, నేను మంచి మిత్రులం, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం గెలిచాం. అందరం మంచి మెజార్టీతో గెలిచాం.పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మనం గెలవాలి. గతంలో సికింద్రాబాద్ నుండీ  ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్రం నుండీ ఒక్క రూపాయి ఖర్చు తేలేదు, ఖర్చు చెయ్యలేదు. కిషన్ రెడ్డి జై శ్రీరాం, మోడీ అని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నాడు. ఇక దానం నాగేందర్ పేరు ఎత్తాలంటేనే సిగ్గు అనిపిస్తుంది. దానం నాగేందర్ మా పార్టీ నుండి గెలిచి, వేరే పార్టీలోకి వెళ్ళాడు, దానం నాగేందర్ ఎమ్మెల్యేగా రాజినామా చెయ్యకుండా ఎంపిగా పోటీ చేస్తున్నాడు.

రాబోయే రోజుల్లో ఉన్న పదవి పోతుంది మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లో 39 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలం గెలిచాం. దానం నాగేందర్ లాంటోల్లు ముగ్గురు పార్టీ మారారు. ఎంత మంది పార్టి మారిన ఏం కాదు, నాయకులను తయారు చేసుకుంటాం. రాబోయే రోజులు బిఆర్ఎస్ పార్టీదే, మళ్లీ కెసిఅర్ గారే ముఖ్యమంత్రి కచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటడో తెలియదని దానం నాగేందర్ కు ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి బిజెపి కార్యకర్తలే ఓట్లు వెయ్యం అంటున్నారు. పార్లమెంట్ లో సికింద్రాబాద్ నుండీ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అడుగు పెడుతున్నాడు.ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండు వారాలు కష్టపడి గెలిచి తీరుదాం...

మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ డ్రామాలు అన్ని చూస్తున్నాం.ప్రజలకు కావల్సింది డ్రామాలు కాదు. ప్రజలకు కావల్సింది అభివృద్ది శాసన సభ ఎన్నికలు ముగియగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి .6 నెలలు లేటుగా ఎన్నికలు వచ్చింటే పుడ్ బాల్ ఆడే వాళ్ళం. నాలుగు నెలలు ఓపిక పడుదామని, మా నాయకులకు నేను చెప్పిన. బిఆర్ఎస్ హయంలో చేసిన అభివృద్ధి అక్కడ అక్కడ కొన్ని పనులు ఆగిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి పనులు చేపిద్దాం.

పెద కుటుంభం నుండీ వచ్చిన వాళ్ళం నేను, పద్మారావు గౌడ్ గారు. అసెంబ్లీ ఎన్నికల లాగానే, పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలి . ఈరోజు కేసీఆర్ గారు బస్సు యాత్రకు బయలుదేరి వెళ్లారు. పల్లేల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది, సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పద్మారావు గౌడ్ పాదయాత్ర చేయబోతున్నారు.అందరి సహకారంతో  పద్మారావు గౌడ్  పాదయాత్ర విజయవంతం చేద్దాం. పద్మారావు కు మద్దతుగా ఈ నెల 27 నుండి నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర లను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పాదయాత్ర లో అభ్యర్థి పద్మారావు గౌడ్ పాల్గొంటారని చెప్పారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్.. పాల్గొన్న మాజీ మంత్రి మహమ్మద్ అలీ, ఎం.ఎల్.సి ఎం.ఎస్. ప్రభాకర్ రావు, సికింద్రాబాద్ అసెంబ్లీ పార్లమెంటరి ఇంచార్జ్ మేడే రాజీవ్ సాగర్, స్థానిక కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, కూతురు నరసింహ, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఏసూరి మహేష్, అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కిషోర్, శ్రీహరి,  ఆంజనేయులు, ఖలీల్, అఖిల్, కరీం లాలా, శ్రీకాంత్ రెడ్డి, నాగులు, తదితర బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు...

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP