01-05-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, మే 1 : తెలంగాణలో నిరంతరంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించిన ఘనత నాటి సిఎం కెసిఆర్ మాత్రమేనని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. ఇప్పుడు దానిని సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. నిరంతరం కోతలు విధిస్తున్న ఘటనలు కోకొల్లలని, గ్రామాలకు వెళితే ప్రజలే చెబుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ను సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. అలాగే గతంలో కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను, రైతు కార్యక్రమాలను అమలు చేసిందని అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేసారని అన్నారు. రైతులకు ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి, అందించి పారదర్శకంగా నిలిచే పాలన అందించారని అన్నారు. రైతులు ఏవిధంగా మరణించినా రూ, 5 లక్షల బీమా అందిస్తోంది కేసీఆరేనన్నారు. రైతులకు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేశామన్నారు. మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి పరచారన్నారు. చెరువులకు నీళ్లు కావాలన్నా.. రైతుబీమా కావాలన్నా.. కెసిఆర్ కారణమని తెలిసిపోయిందన్నారు. ఎంపి ఎన్నికల్లో కనీసం 12 సీట్లు గెలవడమే తమ లక్ష్యమని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓవైపు సంక్షమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిలోనూ అగ్రగామిగా రాష్టాన్న్రి నిలుపుకున్నామని అన్నారు. ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరోమారు కారుగుర్తుపై ఓటు వేయాలన్నారు. ఇకపోతే అన్ని వర్గాల వారికి చేయూతనందిస్తున్న కారణంగా కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశంలోనే అభివృద్ధి పరంగా కేసీఆర్ తెలంగాణ రాష్టాన్న్రి నంబర్‌వన్ స్థానంలో నిలిపి ఉత్తమ సీఎంగా గుర్తింపు పొందారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్లు అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. తెలంగాణలో మరింత అభివృద్ధి జరుగాలంటే టీఆర్‌ఎస్ పార్టీ ఎంపిలను గెలిపించుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్‌లో తమ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అన్నారు.