01-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 1: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రస్తుత పాలనపై బీజేపీ విమర్శలు పేలుతుండగా.. కేంద్రంలో బీజేపీ పాలనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా బీజేపీని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘గాడిద గుడ్డు‘ తప్ప అంటూ సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడిరది బీజేపీనే అంటూ రేవంత్ విరుచుకుపడ్డారు. ‘గాడిద గుడ్డు‘ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ విూడియాలో వైరల్‌గా మారింది.. ఇటీవల కాంగ్రెస్ గాడిదగుడ్డు అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.
ఈ క్రమంలో రేవంత్ ట్వీట్ ఇలా సాగింది.తెలంగాణ అడిగింది?...పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా. కానీ బీజేపీ ఇచ్చింది...‘గాడిద గుడ్డు‘. తెలంగాణ అడిగింది.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ...బీజేపీ ఇచ్చింది..‘గాడిద గుడ్డు‘. తెలంగాణ అడిగింది..బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ..బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు‘. తెలంగాణ అడిగింది. కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం.. బీజేపీ ఇచ్చింది.. ‘గాడిద గుడ్డు‘.తెలంగాణ అడిగింది...మేడారం జాతరకు జాతీయహోదా, కానీ బీజేపీ ఇచ్చింది ..‘గాడిద గుడ్డు‘ తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు, పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు‘ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.