01-05-2024 RJ
సినీ స్క్రీన్
కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ’అరణ్మనై`4’ . ఈ నెల 3న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో ’బాక్’ అనే పేరు పెట్టారు. సుందర్ సి, తమన్నా, రాశీఖన్నా, రామచంద్రరాజు, కోవై సరళ, యోగిబాబు, వీటీవీ గణెళిష్ తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్ తమన్నా.. రాశీ ఖన్నా విరివిగా పాల్గొంటున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా విూడియాతో ముచ్చటిస్తూ.. ఈ కథ వినకుండానే ఈ సినిమాలో చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం దర్శకుడు సుందర్ నన్ను సంప్రదించి కథ వినిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ నేను మాత్రం కథ వినకుండానే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించాను. నాకు ఆయనపై అంత నమ్మకం. ఆ నమ్మకంతోనే కథ వినకుండానే డేట్స్ ఇచ్చేశాను.
నాకు హర్రర్ చిత్రాలంటే అమితమైన ఇష్టం. అలాంటి సినిమాల్లో షూటింగ్ పూర్తయిన తర్వాత చాలా ఎక్కువగా ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులుంటాయి. ఇందులో తమన్నా చాలా అందంగా కనిపిస్తుంది, ఆమెతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. కామెడీ సన్నివేశాల్లో నటించే సమయంలో కష్టపడ్డాను. అయినప్పటికీ సీనియర్ నటి కోవై సరళతో కలిసి హాస్య సన్నివేశాల్లో నటించడం సంతోషంగా ఉంది‘ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇందులో హర్రర్, కామెడీ అన్నీ కూడా ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులని మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఇందులో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది‘ అని అన్నారు.