01-05-2024 RJ
సినీ స్క్రీన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ. దయాకర్‌రావు నిర్మిస్తున్న చిత్రం ’హరిహర వీరమల్లు’ ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మేకర్స్ ఓ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో టీజర్ విడుదల అని తెలిపిన మేకర్స్.. తాజాగా టీజర్ ఎప్పుడు విడుదల కాబోతుందో తెలియజేశారు. విూ ముందుకు... ’ధర్మం కోసం యుద్ధం’ త్వరలో! అని తెలుపుతూ.. టీజర్ అతి త్వరలో విడుదల చేయనున్నామని మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
టీజర్‌ని గురువారం అంటే 2వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలుపుతూ.. ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ’వీరమల్లు’ గెటప్ షెడ్ కనిపిస్తోంది. చేతిలో పవర్ ఫుల్ కత్తితో యుద్దానికి సిద్ధమైన సైనికుడిలా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఆగిపోయినట్లుగా ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఇక ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడమే కష్టమే అనేలా వచ్చిన వార్తలకు నిర్మాత ఏఎం రత్నం.. ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు టీజర్ వదిలి.. అలాంటి వార్తలకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ఈ సినిమా బ్యాలెన్స్ షూట్‌లో పాల్గొనున్నారని తెలుస్తోంది.
టీజర్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని తాజా అప్‌డేట్ చెప్పకనే చెబుతోంది.పవన్ కల్యాణ్ కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. హరిహరవీరమల్లు రెండు పార్టులుగా రాబోతుందని ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే లాంఛ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. హరిహరవీరమల్లు అండ్ టీంపై వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీన్లను ఇప్పటికే రామోజీఫిలింసిటీలో చిత్రీకరించారు. పవన్ కల్యాణ్ మరోవైపు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్నాడు.