02-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 2: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నారు. అదీ గుజరాత్ పెత్తనం ఏంటన్నదానిపైన ఇటీవల ఢల్లీి పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. నా గడ్డపై వచ్చి.. నన్నే బెదరిస్తారా అంటూ హూంకరించారు. ఇకపోతే తెలంగాణలో బిజెపితో ప్రమాదం ఉందని గుర్తించిన రేవంత్ రెడ్డి దానిని ఎదుర్కొనేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే ఢల్లీి పోలీసుల కేసుతో బిజెపిని ఇరుకున పెట్టేందుకు ఘాటుగానే స్పందిస్తున్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తే.. రాష్టాన్రికి ఏం చేస్తామనేదాన్ని ఆయన వెల్లడించనున్నారు . విభజన హావిూల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు తదితర అంశాలకు ఇందులో చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ’న్యాయ్ పత్ర’ పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే మేలు ఏమిటన్నది చెప్పబోతున్నారు. అలాగే బిజెపి పదేళ్లుగా తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డని ప్రచారం చేస్తున్నారు. అంతేగాకుండా ’గుజరాత్ ఆధిపత్యానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు ఇదని అన్నారు.
కుట్రలకు పాల్పడుతున్న భాజపాకు నిజాం, రజాకార్లకు పట్టిన గతే పడుతుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగానే హెచ్చరిస్తున్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని లింగంపల్లిలో, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని మూసాపేట, కూకట్‌పల్లిలలో రోడ్‌షోలు, కార్నర్ విూటింగ్‌లలో ఆయన మాట్లాడారు. ఆయా చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ‘ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికలు ఆషామాషీవి కావు. గతంలోకంటే భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. 400 సీట్లు గెలవడం ద్వారా రిజర్వేషన్లను ఎత్తివేసి అదానీ, అంబానీలకు దేశాన్ని అమ్మాలని భాజపా కుట్ర చేస్తోంది.
ఊరూరా బీసీ, ఎస్సీ, ఎస్టీలను జాగృతం చేస్తున్నానని.. పగబట్టి నన్ను అత్యవసరంగా అరెస్టు చేయాలని దిల్లీలో కేసు పెట్టారు. ఒకవేళ నేను మాట్లాడినది తప్పయితే.. తెలంగాణకు చెందిన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్‌రెడ్డిలు ఇక్కడి పోలీసు స్టేషన్లలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. దిల్లీ పోలీసులతో మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. భాజపా నేతల వద్ద ఈడీ, ఐటీ, సీబీఐ ఉండొచ్చు. కానీ, నా దగ్గర నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలున్నారు. 50 లక్షల మంది తెలంగాణ యువత ఉన్నారని అంటూ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నారు.
మోదీ ప్రధానిగా కాకుండా గుజరాత్ వ్యక్తిగా తెలంగాణకు వచ్చి మనల్ని తిట్టారు.. శపించారు.. మనల్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు.. ఎన్నికల సమయంలో వస్తే ఈ ప్రాంతానికి ఏం ఇస్తారో.. ఏం చేస్తారో చెప్పాలి. వాళ్లు అవి చెప్పడం లేదు. గతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అన్నింటినీ పక్కన పెట్టారు. అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని.. అయిదేళ్లయినా ఇవ్వలేదు. నేనూ స్వయంగా కలిసి పలు సమస్యలపై విన్నవించా. ప్రధాని వీటన్నింటిపై మాట్లాడతారని అనుకున్నా.. కానీ, మాట్లాడలేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నారు.. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే.. మేంతెచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమేనా?
తెలంగాణ ప్రజలు ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలి. పక్క ఊరతను మనల్ని అవమానిస్తే ఊరుకుంటామా? మనకు విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.ఊరందరం ఏకమవ్వాల్సిన సమయమిది. అంటూ ప్రచారంలో కొత్త ఎత్తుగడలను అందుకున్నారు. మోదీజీ.. ప్రధానిగా విూకు ప్రజలు బాధ్యతనిచ్చింది రేవంత్‌రెడ్డిని పోలీసు స్టేషన్‌లో వేయడానికేనా? ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబుకు ఏ గతి పట్టిందో కనుక్కోండి. రజాకార్లకు ఏ పరిస్థితి ఎదురైందో తెలుసుకోండి. రేవంత్‌ను అడ్డుకోవాలంటే దిల్లీలో కేసులు పెట్టి వారం రోజులు తీసుకుని వెళ్లండంటూ మోదీకి కేసీఆర్ చెప్పారేమోనని అనుమానం వస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇంటింటికీ గాడిద గుడ్డును పంపించిన మోదీకి ఓట్లేద్దామా? అన్ని పథకాలు ఇచ్చిన కాంగ్రెస్‌కు వేద్దామా అని ఓటర్లను ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ ఆధిపత్యానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి పోటీ ఇది. తెలంగాణ పౌరుషం గెలుస్తుందో.. గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో చూద్దాం. ఆ రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రం నడిగడ్డ విూద ముఖ్యమంత్రిని బెదిరిస్తుంటే చూస్తూ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఖబడ్దార్ ప్రధానమంత్రి గారూ..! నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా? నేనేం మాట్లాడాను.. రిజర్వేషన్లు రద్దు చేయవద్దని కోరా. రాజ్యాంగాన్ని మార్చవద్దన్నా. విూకు నచ్చితే నా మాట వినండి. నచ్చక పోతే రిజర్వేషన్లు రద్దుచేస్తామని చెప్పి ఓట్లు అడగండని అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న సవాళ్లు ఇప్పుడు జనంలో బాగా నాటుకు పోతున్నాయి.