02-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కాకినాడ, మే 2: వైసీపీకి వరుసగా ఎదరు దెబ్బలు తగులుతున్నాయి. ఎక్కడ చూసినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సామర్లకోటలో వైసీపీకి షాక్ తగిలింది. 100కి పైగా వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. కూటమి అభ్యర్థి చినరాజప్ప.. వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలోనూ.. నియోజకవర్గంలోనూ జగన్ పై ఉన్న వ్యతిరేకత కారణంగానే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. గంజాయి, మత్తు మాఫియా పెట్రేగి పోయి యువతను పెడదోవ పట్టించారన్నారు. కూటమి ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టో బడుగు బలహీనవర్గాల మన్ననలు పొందుతోందని రాజప్ప తెలిపారు.