02-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ఏలూరు, మే 2: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. పంచాయతీ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఈ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారన్నారు.
అభివృద్ధి చెందాలంటే అందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గడచిన ఐదు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామన్నారు. రైతుకు ఏ మాత్రం ఉపయోగం లేని ప్రభుత్వాన్ని చూశామని వ్యాఖ్యలు చేశారు. కూటమిలో మూడు పార్టీలు పేదవారికి న్యాయం చేయాలని సంకల్పంతో పని చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి పురందేశ్వరి స్పష్టం చేశారు.