ad1
ad1
Card image cap
Tags  

  04-05-2024       RJ

7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిన ఘనుడు కెసిఆర్‌: సిఎం రేవంత్‌

తెలంగాణ

కొత్తగూడెం, మే 4: రిజర్వేసన్ల రద్దు చేస్తారని తాము చెబుతుంటే తెలంగాణ బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బిజెపి ఎజెండాలో రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల రద్దు ప్రధానాంశంగా ఉందన్నారు. ఈ రెండు వద్దనుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగూడెం జనజాతర సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. ఆగస్ట్‌ 15 నాటికి రైతుల రెండు లక్షల రుణమాఫీ చేసి, చూపుతామని, హరీష్‌ రావు రాజీనామాకు సిద్దంగా ఉండాలని మరోమారు సవాల్‌ చేశారు. అలాగే కెసిఆర్‌ కరెంట్‌ కోతలపై చేస్తున్న విషప్రచారాన్ని తీవ్రంగా ఖండిరచారు.

కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్‌ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌.. భాజపాలో చేరతారని మేం మొదటి నుంచి చెబుతున్నాం. కేంద్రంలో భాజపా చేసిన అన్ని చట్టాలకు భారాస మద్దతిచ్చింది. కాంగ్రెస్‌ను అడ్డుకునేందు కు ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. గుజరాత్‌ను ఓడిద్దాం.. తెలంగాణను గెలిపించుకుందాం రండి. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్‌ దుష్పచ్రారం చేస్తున్నారు. ఈ నెల 9 లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతా. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ అమలు చేసి హరీశ్‌రావు నోరు మూయిస్తాం అన్నారు.

రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్‌ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారు. అందుకే 2014, 2019, 2023లో భారాసను దూరం పెట్టారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు.. ముందుచూపు ఎక్కువ. పదేళ్ల పాటు తెలంగాణకు ద్రోహం చేసింది భాజపానే. ఈ పదేళ్లలో రాష్టాన్రికి ఒక్కటైనా ఇచ్చారా? రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శే చెప్పారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందకు కాంగ్రెస్‌ను గెలిపించాల న్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్టాన్న్రి కేసీఆర్‌ మాకు అప్పగించారు. భట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కాబట్టి నిధులు సర్దుతున్నారు.

అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం‘ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. పదేళ్లుగా మోడీ తెలంగాణకు చేసిందేవిూ లేదని..రేపు మరేదో చేస్తారన్న ఆశా లేదని ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లను రద్దచేయడమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. అందుకే కులగణన, జనాభా లెక్కల సేకరణ గత పదేళ్లుగా చేపట్టలేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. బిజెపి ఎజెండా మేరకు ముందుకు సాగుతోందని సిఎం విమర్శలు చేశారు. కిషన్‌ రెడ్డి మంత్రిగా ఉండి తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు, వరంగల్‌ రైల్వే కోచ్‌ ఏం చేశారని నిలదీశారు.

పదేళ్లు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావాలని 400 సీట్లు కావాలని అడుగుతున్నారని చెప్పారు. ఆ 400 సీట్లు రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అడుగుతున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబానికి పదవులపై వ్యామోహం లేదని చెప్పారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే కానీ రిజర్వేషన్లు రద్దు కావని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచడమే కాకుండా బలహీనవర్గాల కులగణన కాంగ్రెస్‌ చేస్తుందని చెప్పారు. రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.  సింగరేణినీ కాపడుతాం.. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూసివేసిన, కాలం చెల్లిన ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌లను అందుబాటు లోకి తీసుకుని వస్తామన్నారు.

ఫాం హౌస్‌ కి వెళ్లి వచ్చిన కేసీఆర్‌ పదేళ్లు మొద్దు నిద్ర పోయారన్నారు. సింగరేణి నీ కాపడుతాం.. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా ఇస్తున్నామన్నారు. కొత్తగూడెం స్పాంజ్‌ ఐరన్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. రిజర్వేషన్‌ తొలగించడానికి బీజేపీ చేసిన ప్రయత్నం గురించే సీఎం రేవంత్‌ చెప్పారన్నారు. రేవంత్‌ రెడ్డి పై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో ఆప్టాల్ర్‌ విూరు ఢల్లీికి పిలిపిస్తే మేము భయపడతామా? అన్నారు. తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.కార్యక్రమంలో, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. ఎంపి అభ్యర్థులు రఘురామిరెడ్డి, నాయక్‌లు కూడా పాల్గొన్నారు. 

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP