06-05-2024 RJ
సినీ స్క్రీన్
ఆ మధ్య అల్లు అర్జున్ విశాఖ వెళ్లినప్పుడు అభిమానులు విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే తరహాలో విశాఖపట్నం వెళ్లారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయబోతే సినిమా కోసమని విశాఖపట్నం వచ్చిన విజయ్ దేవరకొండకి విమానాశ్రయంలో పెద్దపెట్టున అభిమానులు విచ్చేసారు. అక్కడ నుండి అభిమానులు విజయ్ వాహనం వెనకాలే మోటారు సైకిల్ ర్యాలీ లా వెళ్లారు.
ఇక విజయ్ కూడా తన అభిమానులను పలకరించడానికి తన కారు టాప్ ఓపెన్ చేసి నిలుచొని అందరికీ అభివాదం చేసుకుంటూ తను బసచేయనున్న హోటల్ కి వెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఎలా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారో, అదే తరహాలో ఇప్పుడు విజయ్ దేవరకొండకి కూడా అభిమానులు ర్యాలీ నిర్వహించడం ఆసక్తికరం.